జనవరిలో తిరుప‌తి శ్రీ కోదండ‌రామాల‌యంలో విశేష ఉత్స‌వాలు

 జనవరిలో తిరుప‌తి శ్రీ కోదండ‌రామాల‌యంలో విశేష ఉత్స‌వాలు

జనవరిలో తిరుప‌తి శ్రీ కోదండ‌రామాల‌యంలో విశేష ఉత్స‌వాలు.

తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో జనవరి నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

• జనవరి 3, 10, 17, 24, 31వ‌ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం, సాయంత్రం 5 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

• జనవరి 3న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు.

• జనవరి 4, 31వ తేదీల‌లో పున‌ర్వ‌సు న‌క్ష‌త్రాన్ని పుర‌స్క‌రించుకుని ఉద‌యం 11 గంట‌ల‌కు శ్రీ సీతారాముల క‌ల్యాణం నిర్వ‌హిస్తారు.

• జనవరి 18న అమావాస్య సందర్భంగా ఉదయం 8.30 గంటలకు సహస్ర కలశాభిషేకం జరుగనుంది. రాత్రి 7 గంట‌ల‌కు హ‌నుమంత వాహ‌న‌సేవ నిర్వ‌హిస్తారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Editor

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *